డ్రైవర్‌ అప్రమత్తతతో.. వలస కార్మికులకు తప్పిన ముప్పు..

vartha vihari : వలస కార్మికులకి పెను ప్రమాదం తప్పింది. సొంతూర్ల వెళ్తున్న వారి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. డ్రైవర్‌ అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడగలిగారు. ఈ సంఘటన గుజరాత్‌లోని ఖేదాలో చోటుచేసుకుంది.
శనివారం 25 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో బెంగళూరు నుంచి వలసకార్మికుల బస్సు జోద్‌పూర్‌ బయలుదేరింది. బస్సు గుజరాత్‌ మాక్వాలోని అహ్మదాబాద్‌-వడోదరా ఎక్స్‌ప్రెస్‌వే పైకి రాగానే చిన్నపాటి మంటలు మొదలయ్యాయి. బస్సు డీజిల్‌ కొట్టించుకోవటానికి పెట్రోల్‌ బంకు దగ్గరకు రాగానే డ్రైవర్‌ ఆ మంటల్ని గుర్తించాడు. డీజిల్‌ కొట్టించుకున్న అనంతరం బస్సు కొద్ది దూరం బయటకు రాగానే మంటలు పెద్దవయ్యాయి. దీంతో‌ వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ ప్రయాణికులు దించేశాడు. పెట్రోల్‌ బంకు సిబ్బంది సైతం ప్రయాణికులు తొందరగా బస్సు దిగేందుకు సహాయ పడ్డారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవ్వరికీ గాయాలు కాలేదు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *