సరికొత్త ఫీచర్లతో వస్తున్న వాట్సాప్

vartha vihari : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన సోషల్ మెస్సేజింగ్‌ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఫోన్‌లో కాంటాక్ట్‌ నెంబర్‌ ఫీడ్‌ చేయాలంటే కీప్యాడ్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత నెంబర్‌ టైప్‌ చేసి…,పేరు కూడా టైప్‌ చేయాలి. ఆ తర్వాత సేవ్‌ చేసుకోవాలి. ఇందులో ఒక్కోసారి నెంబర్‌ తప్పుగా పడటం.. పేరులో పొరపాటు దొర్లటం జరుగుతుంది. ఇలా ఒకట్రెండు నెంబర్లైతే ఓకే. కానీ చాలా నెంబర్లు ఇలా చేయాలంటే ఒకరోజుతో అయ్యే పనికాదు. ఇప్పుడు అలాంటి సమస్యకు చెక్ పెట్టనుంది వాట్సాప్.

ఈ కొత్త ఫీచర్‌తో ఇంతా కష్టపడనవసరం లేదు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్‌ను త్వరలో యూజర్ల ముందుకు తీసుకురానున్నట్లు వాట్సప్‌ ప్రకటించినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *