వాహనదారులకు ఊరట.. ఏపీలో సీజ్ చేసిన వాహనాల విడుదలకు గ్రీన్ సిగ్నల్..

vartha vihari : లాక్‌డౌన్ స‌మ‌యంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలను పోలీసుల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అలాంటివారికి ఏపీ పోలీసులు గుడ్ న్యూస్ అందించారు. లాక్ డౌన్‌లో పట్టుబడిన వాహనాలను తిరిగి అప్పగిస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌తో సంబంధిత పీఎస్‌లను సంప్రదించాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఈ విషయంపై జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కాగా, ఏపీలో లాక్ డౌన్ సడలింపులు భారీగా ఇవ్వడంతో ప్రజా వ్యవస్థ అంతా ఒక్కొక్కటిగా ప్రారంభమవుతోంది.

మరోవైపు తెలంగాణలో లాక్ డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాలను పోలీసులు విడుదల చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జరిమానాలను ఫోన్ పే, గూగుల్ పే, మీ సేవ ద్వారా చెల్చెలించేలా ఏర్పాట్లు కూడా చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉన్న వేళ సుమారుగా 1.60 లక్షల వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *