కరోనా కట్టడికి సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

vartha vihari :  తాడేపల్లి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వైరస్‌ నియంత్రణపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్‌ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. 8 జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రస్తుతమున్న ఐసోలేషన్‌ పడకలు, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. వైరస్‌ సోకడం తప్పేమీ కాదని, నేరం అంతకన్నా కాదని అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్‌ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని అధికారులకు సూచించారు. (నిరుద్యోగం పెరగకుండా ఈ చర్యలు)

వైరస్‌ ఎవరికైనా సంభవించే అవకాశం ఉందని, పరీక్షలను స్వచ్ఛందంగా ముందుకురావాలిన సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. కనీస జాగ్రత్తలు, వైద్య సహాయంతో వైరస్‌ సోకిన బాధితులు కోలుకోవడం సులభమని అన్నారు. ఈ మేరకు ప్రతి గ్రామాల్లో ప్రజలకు అవగాహాన కల్పించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఆళ్లనాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని.. ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరైయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *