కొత్త పెళ్లికూతురికి కరోనా.. క్వారంటైన్‌లో 32 మంది..!

vartha vihari : ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా విజృంభణ ఆగడం లేదు. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఇక లాక్‌డౌన్‌కి సడలింపులు ఇస్తున్నప్పటి నుంచి కేసులు మరింత పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా పెళ్లైన రెండో రోజే పెళ్లికి కరోనా సోకినట్లు తేలింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

భోపాల్‌లోని జట్ ఖేదీ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు, రైజన్‌ జిల్లాలోని సత్లాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సోమవారం వివాహం జరిగింది. ఈ పెళ్లికి 32 మందికి పైగా హాజరయ్యారు. ఈ క్రమంలో పెళ్లి కుమారుడు, పురోహితుడు సహా.. అందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచిన అధికారులు, వారు కాంటాక్ట్ అయిన వారిని తెలుసుకునే పనిలో పడ్డారు.

కాగా అక్కడి అధికారుల సమాచారం ప్రకారం.. గత వారం ఆ మహిళ జ్వరంతో బాధపడగా.. దానికి సంబంధించిన మందులను వాడింది. ఈ క్రమంలో ఆమెకు జ్వరం తగ్గినప్పటికీ.. ఆమె కుటుంబసభ్యులు శనివారం కరోనా పరీక్షను చేయించారు. ఈ క్రమంలో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా మధ్యప్రదేశ్‌లో 5981 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 270 మంది మృత్యువాతపడ్డారు. 2,843 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *