కామంతో కన్న బిడ్డపైనే.. అనేకసార్లు అత్యాచారం

vartha vihari : కూతుర్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే..కామాంధుడిగా మారాడు. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించాడు. కన్నబిడ్డపైనే పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పరిధిలోని పెదవేగి మండలానికి చెందిన దంపతుల 14 ఏళ్ల బిడ్డపై తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆమెను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. చివరకు తండ్రి వికృత చేష్టలు భరించలేక ఆమె ఈ నెల 16న ఇంటి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే, మార్గమధ్యలో ఓ అపరిచిత వ్యక్తి న్యాయం చేస్తానని చెప్పి ఏలూరులో ఓ గదిలో ఉంచి ఆ మరుసటి రోజు తల్లిదండ్రులకు అప్పగించాడు. బాలికపై జరిగిన దాడిని అతడు తల్లికి వివరించాడు. తండ్రి చేస్తున్న అఘాయిత్యం గురించి తెలుసుకున్న తల్లి ఏలూరు దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే, తనకు న్యాయం చేస్తానని చెప్పిన వ్యక్తి కూడా బలాత్కారం చేయబోయాడని బాధిత బాలిక పోలీసులకు చెప్పింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే, తనపై కేసు నమోదు అయ్యిందని తెలిసిన బాలిక తండ్రి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, స్థానికులు గమనించి అతన్ని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స అందిస్తుండగా, పరారీలో ఉన్న అపరిచత వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలికను కూడా ఆస్పత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *