రైతుకు చిక్కిన రూ.కోటి వజ్రం

vartha vihari : అనంతపురం, గుత్తి రూరల్‌:అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామంలో నాలుగు రోజుల క్రితం ఓ రైతుకు విలువైన వజ్రంచిక్కిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ శివారులో ఊటకల్లుకువెళ్లే దారిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి భూమి పదును కావడంతో రైతు సేద్యం పనులు చేశాడు. గుంటకతో భూమిని దున్నడంతో ఓ వజ్రం చిక్కింది. గ్రామంలోని ఇద్దరు వ్యక్తులతో కలిసి వజ్రాన్ని కర్నూలు జిల్లా పెరవలిలో విక్రయించేందుకు ప్రయత్నించగా అక్కడ ధర వద్ద తేడా వచ్చింది. దీంతో గుత్తి ఆర్‌ఎస్‌లోని ఓ వ్యాపారికి రూ.30 లక్షలకు విక్రయించినట్లు తెలిసింది. కాగా ఆ వజ్రం రూ.కోటికి పైగా ధర ఉంటుందని సమాచారం. మధ్యవర్తులు వజ్రాల వ్యాపారితో కుమ్మక్కై రైతుకు తక్కువ ధర ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *