ఏపీలో కరోనా విలయం..2,514 పాజిటివ్ కేసులు…55 మరణాలు

vartha vihari : ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 62 కేసులు నమోదు అయ్యాయి. 8,415 శాంపిల్స్ టెస్ట్ చేయగా, 62 కేసులు బయటపడ్డాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,514కి చేరుకోగా, మృతుల సంఖ్య 55కి పెరిగింది. 1,731 మంది వైరస్ బారిన పడి కోలుకోగా, 728 మందికి చికిత్స కొనసాగుతోంది.

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 600పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 400కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1731మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 55మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఒకరు ప్రాణాలు విడిచారు. తాజాగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో చిత్తూరు జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 14 మంది తమిళనాడు కోయంబేడు నుంచి మొత్తం 18మంది వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *