నాడు రాజన్న.. నేడు జగనన్న..

VARTHA VIHARI :  విజయనగరం : ఉత్తరాంధ్ర అంటేనే వెనుకబడిన ప్రాంతం.. ఇక్కడ అత్యధికంగా ఉన్న బీసీలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో అనేక సంక్షేమ ఫలాలు అందేవి. బీసీ రుణాలతో ఆ సామాజిక వర్గం వారు ఆర్థికాభివృద్ధి సాధించేవారు. టీడీపీ అధికంలోకి వచ్చిన తరువాత బీసీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. బీసీలను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన మాజీ సీఎం చంద్రబాబు వారి సంక్షేమాన్ని అటకెక్కించారు. ఆ సమయంలో ప్రజా సంకల్పయాత్ర చేపట్టి బీసీల కష్టాలను తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో అదనంగా పదిశాతం సీట్లను బీసీలకు కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ సామాజిక వర్గం వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

ఎన్నికల్లో సీట్లు కేటాయింపులో బీసీ, ఉపకులాలకు సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి  ప్రాధాన్యమిచ్చారు. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు పెంచినప్పటికీ టీడీపీ వేసిన పిటిషన్ల కారణంగా ఆ ప్రయత్నం ఫలించలేదు. 50 శాతానికే రిజర్వేషన్లు నిర్ణయించాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో కోర్టు తీర్పును గౌరవించిన అధికారపార్టీ ఇచ్చిన మాటను నిలుపుకోవడంలోనూ వెనుకంజ వేయలేదు. జనరల్‌కు కేటాయించిన స్థానాల్లో కొన్నింటిని బీసీలకు ఇవ్వడం ద్వారా మరో కోర్టు తీర్పు వల్ల కోల్పోయిన 10 శాతం రిజర్వేషన్లను పార్టీ తరఫున ఇస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సంచలన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *