కనురెప్పే కాటేసింది…….

VARTHA VIHARI : ఖమ్మం : సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వె లుగు చూసింది. కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ కిరాతకుడు కూతురిపైనే గత అ ర్నెళ్లుగా అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడు. ఆ యువతి గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన పిట్ల నర్సింహులు సొంత కూతురి(19)పైనే కన్నేశాడు.

ఓ రోజు ఇంట్లో భార్య, కుమారుడు ఉండగా అందరూ కలిసి కల్లు తాగారు. అనంతరం మద్యం మత్తులో వావి వరసలు మరిచిన నర్సింహులు కన్న కూతురిపైనే బలత్కారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయం తల్లికి చెప్పగా, ఆమె భర్తను గట్టిగా నిలదీసింది. అయినా వక్రబుద్ధి మారని ఆ కిరాతకుడు కూతురుని బెదిరిస్తూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో సోమ వారం కళ్లు తిరిగి పడిపోయిన ఆ యువతి గ్రామంలోని ఆశ వర్కర్‌ వద్దకు వెళ్లింది. అక్కడ పరీక్షలు చేయించగా రెండు నెలల గర్భిణి అని తేలింది. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. బాధితురాలి తల్లి మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!