గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు మేరకే.. పోలవరం

VARTHA VIHARI : అమరావతి : గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు మేరకే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజైన్‌లు మార్చామని ఒడిశా సర్కార్‌ చేస్తున్న వాదనలో వీసమెత్తు వాస్తవం లేదని తెలిపింది. అవాస్తవ అంశాలు వల్లె వేస్తూ ఒడిశా సర్కార్‌ న్యాయస్థానాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని వివరించింది. ‘దేశంలో జైసల్మేర్‌ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యేది అనంతపురం జిల్లాలోనే. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దుర్భిక్ష అనంతపురం జిల్లాతోపాటు రాష్ట్రంలోని 13 జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తే రాష్ట్రం సుభిక్షమవుతుంది. ఇందుకు సహకరించాలి’ అని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు 78 పేజీల అఫిడవిట్‌ (ప్రమాణపత్రం)ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. పోలవరం పనులు నిలుపుదల చేయాలని కోరుతూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!