అంత్యక్రియలకు తరలిస్తుండగా కళ్లు తెరచిన మహిళ

VARTHA VIHARI : బెంగళూరు : తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న మహిళ మృతి చెందిందని భావించిన బంధువులు అంత్యక్రియలకు తరలిస్తున్న సమయంలో కళ్లు తెరిచిన సంఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకొంది. బెళగావి జిల్లాలోని ముచ్చెండి గ్రామానికి చెందిన సిద్దేశ్వర నగర మాలు యల్లప్ప చవగల్‌ (55) అనే మహిళకు తలకు జ్వరం సోకిందని బంధువులు బెళగావి జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందని వైద్యం కూడా చేయలేమని గుండె నిలిచిపోయిందని బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఓ డాక్టర్‌ కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కోల్పోయామనే బాధతో ఇంటికి తీసుకువచ్చారు. బంధువులు మిత్రులు అందరూ రోదిస్తూ అంత్యక్రియలకు ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు.

అంతిమ సంస్కారాలకు తరలించేముందు డప్పులు వాయిస్తూ కుటుంబ సభ్యులంతా రోదిస్తుండడంతో శవంలా పడిపోయిన మాలు చవగల్‌ కళ్లు తెరిచి చూశారు. దీంతో బంధువులు నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత ఆమెను కూర్చోబెట్టి పాలు అందించారు. అంత్యక్రియలకు వచ్చిన బంధువులు వైద్యుల నిర్లక్ష్యం అంటూ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!