గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన మంత్రి జగదీష్ రెడ్డి

VARTHA VIHARI : హైదరాబాద్ : పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి, శాసనసభ్యులు కర్నె ప్రభాకర్, చిరుమర్తి లింగయ్య విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను విద్యుత్తు శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్వీకరించారు. ఈ క్రమంలో… మంత్రుల నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలా సాగాలంటూ ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నేలంతా పచ్చగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. సమజాహితం కోసమే గ్రీన్ ఛాలెంజ్ అని మంత్రి స్పష్టం చేశారు. కాగా… పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ట్రాన్స్‌కో & జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, టీఎస్‌ఎస్‌‌సీడీసీఎల్ సి అండ్ యం డి రఘుమారెడ్డిలకు మంత్రి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చారిత్రాత్మకమైనదని జగదీష్ రెడ్డి అభివర్ణించారు. ఇప్పుడిప్పుడే ఇది యావత్తు దేశానికి పాకుతోందన్నారు. పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్, ట్రాన్స్ కో&జెన్కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, టీఎస్‌ఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి మంత్రి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చారిత్రాత్మకమైనదని జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే ఇది యావత్తు దేశానికి పాకుతోందన్నారు. గ్రీన్‌ఛాలెంజ్ కార్యక్రమం సమజాహితం కోసమేనన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఇప్పుడు ఒక ఉద్యమంలా ముందుకు సాగడం అభినందనీయమని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *