హైదరాబాద్‌: పెట్రోల్‌ బంక్‌లో అగ్నిప్రమాదం

VARTHA VIHARI : హైదరాబాద్‌ : షేక్‌పేట్‌లోని పెట్రోల్‌ బంక్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కారులో పెట్రోల్‌ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమయింది. ఇండియన్‌ ఆయిల్‌ బంకులో ఈ ప్రమాదం జరిగింది. పెట్రోల్ బంక్‌లో దట్టమైన పొగ కమ్ముకుంది. కారులోని వ్యక్తి ఫోన్ మాట్లాడుతుండడంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!