పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

VARTHA VIHARI : అనంతపురం : పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లా గాండ్లపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని రజిత పురుగుల మందు తాగి.. ప్రార్థన చేస్తున్న సమయంలో కింద పడిపోయింది. దీంతో గమనించిన ఉపాధ్యాయులు రజితను హుటాహుటిన గాండ్ల పెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రజిత పరిస్థితి విషమంగా ఉండటంతో కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!