నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సమీక్ష జరిపిన రాష్ట్ర మంత్రులు……

VARTHA VIHARI : నెల్లూరు : నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రులు ఆళ్ల నాని, అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉండే సౌకర్యాలు, అసౌకర్యాలు మీద ఎక్కువ దృష్టి సారించి వైద్యశాల అధికారులతో మరియు వైద్యులతో రాష్ట్ర మంత్రులు చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో వైద్య సేవల కోసం వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు అందించాలని అటు వైద్యులను, ఇటు అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!