వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు కు ప్రాధాన్యత ఇవ్వాలి ఆనం….

VARTHA VIHARI : నెల్లూరు : వెనుకబడ్డ వెంకటగిరి నియోజకవర్గం ప్రాంతానికి వైద్య ఆరోగ్య మౌలిక వసతుల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలి అని ఉప ముఖ్యమంత్రివర్యులు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కి మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి విన్నవించారు.ఈరోజు నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి మెడికల్ కళాశాల ప్రాంగణంలో నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించడానికి విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు వైద్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ గారికి వెంకటగిరి నియోజకవర్గ సమస్యల గురించి పలు విజ్ఞాపనలను ఆనం రామనారాయణ రెడ్డి గారు అత్యవసరమై హైద్రాబాద్ వెళ్లినందున సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ద్వారా విన్నవించారు. ఈ సందర్భంగా :వెంకటగిరి లో బ్రిటీష్ కాలం నాటి నుంచి ప్రారంభించిన ప్రఖ్యాత గోషా హాస్పిటల్ పునర్ ఏర్పాటులో భాగంగా వెంకటగిరి లో వంద పడకల ఆసుపత్రితో పాటు కిడ్నీ డయాలసిస్ యూనిట్ యొక్క ప్రతిపాదనను త్వరగా ఆమోదించి పరిపాలనా పరమైన మంజూరు చేసి తగు సహకారం అందించవలసిందిగా కోరారు. అలాగే బాలాయపల్లి మండలం జయంపు నందు నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ద్వారా 30 పడకల ఆసుపత్రి, రాపూరు మండలం పెనుబర్తి నందు నూతన పి హెచ్ సి కేంద్రాన్ని,, సైదాపురం మండలం మర్లపూడి నందు మరో పి హెచ్ సి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సైదాపురం పీ హెచ్ సి ని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయుటకు అవసరమైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మంజూరు చేయవలసిందిగా ను అలాగే నూతన క్లస్టర్ విధానంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి, రాపూరు రెండు ప్రాంతాలలో మెడికల్ క్లస్టర్ హెడ్ క్వార్టర్ లను ఏర్పాటు చేయడం ద్వారా వెనుకబడిన అటవీ ప్రాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!