జగన్ కావాలోమంగళగిరి జనం కావాలో ఆర్కే తేల్చుకోవాలి

VARTHA VIHARI : అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. మంగళగిరి నియోజకవర్గంలో ఓట్లేసిన ప్రజలంతా రాజధాని మార్చొద్దని రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారన్నారు. వారి ఆస్తుల్ని త్యాగం చేసిన రైతులకు ఇవ్వాల్సింది ప్లాట్లు కాదని.. ప్రజా రాజధాని ఇవ్వాలన్నారు. రాజధాని మార్పుపైన ఇంత రాద్దాంతం జరుగుతుంటే ఎమ్మెల్యే ఆర్కే ఎక్కడ దాగి ఉన్నాడు. .? అని ఆయన ప్రశ్నించారు.

ఆర్కే ఎందుకు ప్రజల ముందుకు వచ్చి స్పష్టత ఇవ్వకుండా జగన్‌‌కు మద్దతు తెలుపుతున్నాడు. జగన్‌ కావాలో.. నియోజకవర్గ జనం కావాలో.. ఎమ్మెల్యే ఆర్కే తేల్చుకునే సమయం వచ్చింది. అమరావతి కొనసాగింపునకు మద్దతుగా ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేయాలి. ప్రజల భవిష్యత్తు కన్నా వ్యక్తిగత భవిష్యత్తే ముఖ్యమని ఆర్కే భావిస్తే చరిత్ర హీనుడుగా మిగిలిపోవడం ఖాయం. రాజధానిని మార్చి ప్లాట్లు ఇస్తే రైతులు వాటిని ఏం చేసుకోవాలి?’ అని ప్రభుత్వం తీరుపై అనగాని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!