కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య…..

VARTHA VIHARI : నెల్లూరు-(కార్తీక్ ఉదయగిరి రిపోర్టర్) : ఉదయగిరి పట్టణంలోని సినిమా హాల్ సెంటర్ కు చెందిన పఠాన్ కర్మిష 21 సంవత్సరాల వయసు కలిగిన వివాహిత సోమవారం ఉదయం తమ గృహంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలకొన్నది. స్థానిక వివరాల మేరకు అత్త మందలించింది అని మనస్థాపానికి గురై తమ ఇంటిలోని ఫ్యాన్ కు తన చీర తోనే ఉరేసుకుని మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు కుటుంబ సభ్యులతో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు.అప్పటికే మృతి చెందిందని డాక్టర్ సందాని భాష గుర్తించారని స్థానికులు తెలిపారు. మృతురాలు పర్మిషన్ దుత్తలూరు మండలం లోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన కరిష్మాకు ఉదయగిరి చెందిన మస్తాన్ తో గత ఏడాది క్రితం వివాహం నట్లు వివరించారు. ఈ విషయంపై సానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ముత్యాలరావు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!