వీరి చలపతికి మరెన్నో పదవులు రావాలి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

VARTHA VIHARI : నెల్లూరు : సీఎంఎస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వీరి చలపతికి మరెన్నో పదవులు భవిష్యత్తులో రావాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు .నెల్లూరులోని పుర మందిరంలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాణ స్వీకార, సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు .రైతుల వ్యవహారాల్లో మంచి అవగాహన కలిగిన వీరి చలపతి, వారితో సత్సంబంధాలు నెరపాలని కోరారు .సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారని, పదవుల విషయంలో సముచితమైన వ్యక్తులకే వాటిని కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. పేదలకు ఆయన ఇచ్చిన మాట ప్రకారం వాగ్దానాలను నెరవేరుస్తూ వారికి ఎంతో మేలు చేస్తున్నారని ప్రశంసించారు. వీరి చలపతికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సముచితమైన స్థానాన్ని కట్టబెట్టి గౌరవం ఇచ్చారని తెలిపారు .ఆయన ఈ పదవికి అర్హుడని, ఇది ఎంతో సంతోషదాయకం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వైసిపి జిల్లా యువనేత రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షత వహించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ,తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి ,ఎమ్మెల్యేలు వరప్రసాద్, ప్రసన్నకుమార్రెడ్డి ,కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు ఆనం జయకుమార్ రెడ్డి ,నెల్లూరు రూరల్ ఇన్చార్జి గిరిధర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి ,వైసీపీ నేతలు గోపాల్ రెడ్డి , స్వర్ణ వెంకయ్య రంగ మయూర్ రెడ్డి, మేరిగ మురళీధర్ తదితరులు హాజరయ్యారు .ఈ కార్యక్రమానికి రైతులు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో విచ్చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!