జనవరిలో మూలస్థానేశ్వర స్వామి ఆలయ కుంభాభిషేకం మంత్రి అనిల్…..

VARTHA VIHARI :  నెల్లూరు : నెల్లూరు నగరంలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో జనవరి నెల 24 నుంచి 27 వరకు కుంభాభిషేకం మహోత్సవాలు జరుగుతాయని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కుంభాభిషేక ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు 27న కుంభాభిషేక మహోత్సవాన్ని దేవాలయంలో నిర్వహిస్తామన్నారు .భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు రూప్ కుమార్ యాదవ్ , లోకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, నూనె మల్లి ఖార్జున్ యాదవ్, కొండెడ్డి రంగా రెడ్డి , ఆలయ ఈవో వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!