నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో శస్త్రచికిత్స విజయవంతం…..
నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో మెదడులోని క్లిష్టమైన ఎన్యూరిజం మరియు ఏ వి ఎం కు 12 గంటలపాటు జరిగిన శస్త్రచికిత్స విజయవంతం అయిందని ఇంచార్జ్ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. శనివారం నారాయణ హాస్పిటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ, కడప జిల్లా సింగనమల కు చెందిన వెంకటస్వామి(50) గత తొమ్మిది నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ, నారాయణ హాస్పిటల్ నీరో సర్జన్ డాక్టర్ సాయి కిరణ్ ను కలవడం జరిగిందని తెలిపారు, అనంతరం బాధితుడికి చేయవలసిన పరీక్షలు చేసి మెదడుకు సంబంధించిన రక్తనాళంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వాటిని నివారించాలంటే శస్త్ర చికిత్స అవసరం అని నారాయణ హాస్పిటల్ వైద్యులు నిర్ధారించారు . దాదాపు పన్నెండు గంటలపాటు ఈ శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని బాధితుల కుటుంబ సభ్యులకు తెలియజేశారు అయితే ఈ శస్త్ర చికిత్స పూర్తిగా ఆరోగ్యశ్రీ కింద చేయడం జరిగిందని నారాయణ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేశారు. శస్త్రచికిత్స అనంతరం బాధితులైన వెంకటస్వామి పూర్తిగా కోలుకోవడం జరిగిందని మీడియా ముందుకు బాధితుడిని ప్రవేశపెట్టి తెలియజేశారు. ఈ సమావేశంలో డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ అనిల్, డాక్టర్ విజ్జు రవీంద్రన్ , నారాయణ వైద్యశాల ఇంచార్జ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.