‘పోలీస్‌శాఖ-యాక్సిస్ బ్యాంకు మధ్య ఎంవోయూ’
VARTHA VIHARI NEWS:డీజీపీ గౌతమ్ సవాంగ్-యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి రామకృష్ణ సమక్షంలో పోలీస్‌శాఖ-యాక్సిస్ బ్యాంకు మధ్య ఎంవోయూ కుదిరింది. పోలీసు సిబ్బంది సాలరీ ఖాతాపై ఉత్తమ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు, ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా భద్రతను అందించేందుకు ఈ ఒప్పందం కుదిరినట్లు వారు తెలిపారు. వ్యక్తిగత ప్రమాద బీమాకు రూ.30 లక్షలు, ఉగ్రవాద దాడిలో మరణిస్తే మరో రూ.పది లక్షలు మొత్తం కలిపి రూ.40 లక్షలు వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందన్నారు. వ్యక్తిగత ప్రమాద బీమా హోంగార్డులకు కూడా వర్తింస్తుందని, యాక్సిస్ బ్యాంకు డెబిట్ కార్డు ద్వారా మరో ఐదు రకాల ఇన్సూరెన్స్ పథకాలు పోలీస్ సిబ్బందికి వర్తిస్తాయని వారు చెప్పారు.