మరో జన్మంటూ ఉంటే జగనన్నకు సైనికుడు గానే ఉంటా మంత్రి అనిల్ కుమార్ యాదవ్

 

VARTHA VIHARI NEWS : మరో జన్మంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సైనికుడు గానే ఉంటాను అని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లాలో రైతన్న భరోసా పథకాన్ని ప్రారంభించే సభలో మంత్రి మాట్లాడుతూ, రైతన్నకు చెప్పిన దానికంటే ఎక్కువగా సహాయము అందిస్తున్న ముఖ్యమంత్రిగా , ఆ మహా నాయకుడు రాజశేఖర్ రెడ్డి వారసుడిగా చరిత్రలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మనసున్న మారాజు రాజ్యానికి రాజు అయితే దేవుడు కూడా కరుణించి రాష్ట్రంలోని ప్రతి డ్యాము ను నిన్ను కుండవలె ఉంచడం జరిగిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రికార్డులు సృష్టించాలన్న రికార్డులు తిరిగి రాయాలన్నా ఒక్క వైయస్ కుటుంబానికే చెందుతుందని మంత్రి అనిల్ అన్నారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో బిసి నాయకున్ని మంత్రిని చేయలేదని, అటువంటి ఈ జిల్లాలో మొదటిసారిగా ఒక బిజీ ని ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నని, ఈ విషయం రాబోవు తరాల్లో కూడా చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!