పార్టీ బాగుండాలి అంటే కార్యకర్త బాగుండాలి మంత్రి అనిల్ కుమార్ యాదవ్….

 

VARTHA VIHARI NEWS : పార్టీ అయినా బాగుండాలి అంటే ముందుగా ఆ పార్టీలోనే కార్యకర్తలు బాగుండాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గురువారం నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం లో దసరా ఉత్సవాలకు ఉత్సవ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ, ముందుగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన వీళ్లకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి మాట్లాడుతూ, గత పది సంవత్సరాల నుంచి మా వెంట ఉండి మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చిన ప్రతి కార్యకర్త బాగుండాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేస్తున్నామని మంత్రి అన్నారు. ఈరోజు నేను మంత్రిగా, శ్రీధర్ అన్న శాసనసభ్యులుగా ఉన్నాము అంటే దాని వెనక ఉన్న కార్యకర్తల కష్టాన్ని మాత్రం ఎన్నడూ మరిచిపో మని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రాబోయే దసరా ఉత్సవాలలో అందరూ సమిష్టిగా కృషిచేసి విజయవంతం చేయాలని కమిటీ సభ్యులను, అధికారులను, మరియు నాయకులను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!