డీటీడీసీ సూపర్ ప్రాంచైజ్ ప్రారంభం వినియోగదారుల నమ్మకంతోనే అగ్రస్థానం – సీఎండీ సుభాష్ చక్రవర్తి

VARTHA VIHARI NEWS: వినియోగదారుల నమ్మకంతోనే డీటీడీసీ కి కార్గోలో అగ్ర స్థానం దక్కిందని డీటీడీసీ ఎక్స్ ప్రెస్ లిమిటెడ్ .సి.ఎం.డి సుభాష్ చక్రవర్తి పేర్కొన్నారు. స్థానిక పడారుపల్లి సెంటర్లో డీటీడీసీ నెల్లూరు ఫ్రాంచైజ్ ని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఈ కామర్స్ సేవలు, ఫార్మా పంపిణీ, క్లస్టర్ వ్యాపారం కోసం మంచి డిమాండ్ ఉందన్నారు. కొత్త సంస్థల విస్తరణకు నెల్లూరు కీలకమైన ప్రదేశమన్నారు. రాష్ట్రంలో చివరి మైలుకు కూడా సేవలు అందించడమే తమ సంస్థ కర్తవ్యమన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. డీటీడీసీ లో సాంకేతికంగా పలు మార్పులను తీసుకు వస్తున్నామన్నారు. దేశంలోనే కాక ఇతర దేశాలకు కూడా తమ సంస్థ సేవలను అందిస్తోందన్నారు. 1990 నుంచి డీటీడీసీ బెంగళూరు కేంద్రంగా ప్రారంభమై తమ సంస్థ అంచెలంచెలుగా ఎదిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీటీడీసీ సౌత్ ఏవీపీ మాధ్యో, జోనల్ ఛానల్ మేనేజర్ సౌమిత్రా చౌదరి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ విశ్వనాధ్, రీజనల్ మేనేజర్ వశిష్ట షాస్టాయ్, నెల్లూరు సూపర్ ప్రాంచైజర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!