తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మ‌త్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు –

VARTHA VIHARI NEWS :  శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల ప్ర‌త్యేక వ్యాసం
తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మ‌త్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు – భ‌క్తుల సౌక‌ర్యాల‌కు పెద్ద పీట‌

తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 30 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వ‌ర‌కు అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ది.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేర‌కు తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి ఆధ్వ‌ర్యంలో భ‌క్తులంద‌రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల‌తో పాటు మూల‌విరాట్ ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు వేగ‌వంతంగా పూర్తి చేస్తున్నాయి.

బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ప్రచారం-

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులను ఆహ్వానించేందుకు టిటిడి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇందుకోసం 12 వేల గోడపత్రికలు, ఒక లక్ష పాంప్లెట్లు, 4,500 బుక్‌లెట్లల‌ను అన్ని ప్రాంతాల భక్తులకు అర్థమయ్యేలా తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ముద్రించింది.

వాహనసేవల వివరాలు, ఇతర సమాచారంతో కూడిన పత్రికలను తిరుమల, తిరుపతిలోని సమాచార కేంద్రాలు (మే ఐ హెల్ప్‌ యు కౌంటర్లు) సర్వదర్శనం కౌంటర్ల ద్వారా భక్తులకు పంపిణీ జరుగుతోంది. దేశవ్యాప్తంగా గల టిటిడి కల్యాణమండపాలు, సమాచార కేంద్రాల్లో గోడపత్రికలను అంటించి భక్తులకు సమాచారం తెలియజేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. తిరుమల-తిరుపతి  బస్సులతోపాటు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి తిరుపతికి రాకపోకలు సాగిస్తున్న బస్సులకు గోడపత్రికలు అంటించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ఆర్‌టిసి, పర్యాటక శాఖ అధికారులకు ప్రచార సామగ్రిని అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!