జగన్ మరో సంచలన నిర్ణయం !

VARTHA VIHARI NEWS : ఇంతవరకు ఏ ప్రభుత్వమూ తీసుకోని ఒక సంచలన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో డాక్టర్లు సరిగా పనిచేయకుండా సొంత క్లినిక్ లు పెట్టుకుని వాటిపైనే దృష్టిసారిస్తున్న నేపథ్యంలో జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసు చేయడాన్ని ఏపీ సర్కారు నిషేధించింది. ఇది సాధ్యమయ్యే పనా కాదా అన్నది పక్కన పెడితే… కచ్చితంగా అనూహ్యమైన సంచలన నిర్ణయమే అని చెప్పొచ్చు. ఈ నిర్ణయంతో కొందరు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా కూడా చేసే అవకాశాలున్నాయి.

ఆరోగ్య రంగంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతరావు కమిటీ సిఫారసులకు ఏపీ  ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వైద్య రంగ ప్రక్షాళనకు ఈ కమిటీ వంద ముఖ్యమైన సిఫారులు చేయగా… అందులో ఇదొకటి. ప్రైవేటు ప్రాక్టీస్ ను నిషేధించడం ప్రజలకు పెద్ద ఊరట. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే రోగులకు అతిపెద్ద ఊరట అని చెప్పాలి. ప్రభుత్వ వైద్యులు దీనిని తిరుగుబాటు చేయలేరు గాని తీవ్రమైన అభ్యంతరం, అసంతృప్తి వ్యక్తంచేసే ప్రమాదం ఉంది. కొందరు ఉద్యోగాలు మానేసినా ఆశ్చర్యం లేదు. అయితే.. నిషేధం అనే బ్యాడ్ న్యూస్ తో పాటు డాక్టర్లకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పింది.  ప్రభుత్వ వైద్యుల వేతనాలను ఎక్కువ శాతం పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. తద్వారా వారి అసంతృప్తికి చాలావరకు కళ్లెం వేయొచ్చని గవర్నమెంటు ఆలోచన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *