నెల్లూరు అపోలో అరుదైన శస్త్రచికిత్స…..

VARTHA VIHARI NEWS : ఏపిలోనే తొలిసారిగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో న్యూరో హైఫ్లో బైపాస్ సర్జరీ……
విజయవంతంగా నిర్వహించిన సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ వికే ఆనంద్, డాక్టర్ యశ్వంత్……..
వైద్య రంగంలో ఎప్పటికప్పుడు మారుతున్న నూతన విధానాలను అనుసరిస్తూ ఆధునిక వైద్యంతో విశేష సేవలందిస్తున్న నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ మరో ఘనతను సాధించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ ఎక్కడా జరగని హై రిస్క్ న్యూరో బైపాస్ సర్జరీని హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ వి.కే. ఆనంద్ వారి బృందం విజయవంతంగా నిర్వహించారు. ఢిల్లీ ఎయిమ్స్ లో న్యూరో సర్జన్ గా సేవలందిస్తూ కొద్ది కాలం క్రితం నెల్లూరు అపోలో హాస్పిటల్ కు వచ్చిన డాక్టర్ వికే ఆనంద్ అతి క్లిష్టమైన కేసులను సవాలుగా తీసుకుని వాటిని విజయవంతం చేయడంలో పేరు పొందారు. వివరాల్లో కెళ్తే…. 60 ఏళ్ల చిన్నమ్మ అనే మహిళ తీవ్రమైన తలనొప్పితో ఈ ఏడాది జనవరి నెలలో అపోలో హాస్పిటల్ కు వచ్చారు. దీంతో వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి మెదడుకు రక్తం సరఫరా అయ్యే రక్త నాళంలో వాపు ( RIGHT ICA GAINT COMPLEX ANEURYSM ) ఉందని గుర్తించారు. హాస్పిటల్ వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని రోగికి చెప్పారు. అయితే వారు రెండవ అభిప్రాయం కోసం మరి కొన్ని హాస్పిటల్స్ ను సంప్రదించి సాధారణ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. శస్త్ర చికిత్స అనంతరం రోగికి ఎలాంటి ఉపశమనం లభించకపోగా క్రితం ఉన్నటు వంటి తీవ్ర తలనొప్పికి తోడు వాంతులు, మరియు కంటి చూపు సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో వారు మళ్లీ ఆగస్టు నెలలో అపోలో హాస్పిటల్ ను సంప్రదించారు. విషయం మొత్తం వారి ద్వారా తెలుసుకున్న హాస్పిటల్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ వి.కే. ఆనంద్ రోగికి సీటి స్కాన్, యాంజియోగ్రామ్ ( IADSA ) పరీక్షలు చేసి ఇంతకు ముందున్న దానికంటే వ్యాధి తీవ్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *