విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ అవార్డులు..

VARTHA VIHARI NEWS: ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ వారు 2019 – 20 జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ (JRC/YRC) నోడల్ ఆఫీసర్లకు స్థాయిలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం 2018 – 19 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యా సంస్థలకు, నోడల్ ఆఫీసర్లకు మరియు వాలంటీర్లకు జిల్లాస్థాయి అవార్డులను బహుకరించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శన్ రావు గారు మరియు గౌరవ అతిథిగా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఏవీ సుబ్రహ్మణ్యం గారు పాల్గొని అవార్డులు ప్రధానం చేశారు.మరియు జూనియర్ & డిగ్రీ కళాశాల ఆఫీసర్స్ కు అవార్డు గ్రహీతలకు 35 అవార్డులను ఇవ్వడం జరిగింది. జిల్లాస్థాయిలో మొక్కల పెంపకం, పరిశుభ్రత, బెస్ట్ మేనేజిమెంట్, సామాజిక సమస్యల మీద అవగాహన వంటి నాలుగు విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యాసంస్థగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకు గాను విశ్వవిద్యాలయ కళాశాల గత ప్రిన్సిపాల్ అయిన ఆచార్య అందే ప్రసాద్ గారు, ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన్ రావు గారు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ మన్యం గారి చేతుల మీదగా జరిగింది. అలాగే నోడల్ ఆఫీసర్ గా విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం డాక్టర్ ఉదయ శంకర్ అవార్డును అందుకున్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి సందర్భంగా అవార్డు ఇరువురిని అభినందించారు. అందే ప్రసాద్ గారు శంకర్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి అవార్డ్ సెలక్షన్ కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *