రేణిగుంట నుంచి శ్రీహరికోటకు బయలుదేరిన భారత రాష్ట్రపతికి సాదర వీడ్కోలు..

VARTHA VIHARI NEWS : శ్రీహరికోట నుండి నేటి అర్థరాత్రి దాటాక చంద్రయాన్ -2 ప్రయోగాన్ని వీక్షించ నిమిత్తం ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాపర్లో బయలుదేరిన గౌ.భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాధ్ కొవింద్ వారికి సాదర వీడ్కోలు లభించింది. రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్తా , సబ్ కలెక్టర్ డా.మహేష్ కుమార్, తిరుపతి అర్బన్ ఎస్.పి.అన్బు రాజన్, విమానాశ్రయ డైరెక్టర్ సురేష్ , చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ శుక్లా, ఆద్యాద్మిక అడ్వైజర్ విజయ్ కుమార్ గురూజీ వీడ్కోలు తెలిపిన వారిలో వున్నారు. ఎస్.సి.కార్పొరేషన్ ఇడి కనకనరసారెడ్డి, మెప్మాపిడి జ్యోతి, సెట్విన్ సి ఇ ఓ లక్ష్మి , రేణిగుంట తహశీల్దార్ విజయసింహా రెడ్డి, ఏర్పేడు తహశీల్దార్ సుబ్బన్న, డిఎస్పీ చంద్రశేఖర్ , సిఐ అంజుయాదవ్ తదితరులు విమానాశ్రయంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం ఉదయం 10 భారత రాష్ట్రపతి తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని డిల్లీ బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ , రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి , ప్రముఖులు వీడ్కోలు తెలపనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!