స్వచ్ఛత పట్ల శ్రద్ద చూపించినట్లైతే పరిసరాలు శుభ్రంగా ఉంటాయి : మై ఫ్రెండ్స్ అస్సోసియేషన్

 

VARTHA VIHARI NEWS : మై ఫ్రెండ్స్ అస్సోసియేషన్ మరియు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో స్వచ్ భారత్ సమ్మర్ ఇంటర్నషిప్ లో భాగంగా మై ఫ్రెండ్స్ అస్సోసియేషన్ సభ్యులు మరియు RTC సిబ్బంది కలిసి RTC బస్టాండ్ అవర్ణంలోని పరిసరాలను శుభ్రపరిచి, గతంలో నాటిన చెట్లకు పాదులు తీసి, కలుపు మొక్కలను తీసివేయడం జరిగింది. RTC DM అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ మై ఫ్రెండ్స్ అస్సోసియేషన్ వారు స్వచ్ భారత్ గురించి చెప్పిన వెంటనే స్పందించి 20 మంది సభ్యులతో కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషమని కొనియాడారు, మై ఫ్రెండ్స్ అస్సోసియేషన్ అధ్యక్షుడు రాహుల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వచ్ఛత పట్ల శ్రద్ద చూపించినట్లైతే పరిసరాలు శుభ్రంగా ఉంటాయని, తాము ఏ కార్యక్రమము చేపట్టిన తమ సభ్యుల సహకారం మరియు వారి తల్లిదండ్రుల ప్రోత్సహం వల్లే సాధ్యమని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో RTC DM అశోక్ కుమార్ గారు, మై ఫ్రెండ్స్ అస్సోసియేషన్ అధ్యక్షులు రాహుల్, సంయుక్త కార్యదర్శి నంద , సభ్యులు కిరణ్, కలీమ్, సందీప్, శ్రీను, ప్రణయ్, అభిషేక్, దావూద్, సాయి, సాయి తేజ, తరుణ్, గిరి, జవాద్,పవన్, హర్నద్, ఉదయ్, కుమార్, RTC సిబ్బంది ప్రవీణ్, వెంకయ్య, నారాయణ తదితరులు పలుగొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!