శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వావారిని దర్శించుకున్న భార‌త రాష్ట్ర‌ప‌తి..

VARTHA VIHARI NEWS : భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కొవింద్ దంపతులు శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీపద్మవతి మ్మ వారిని దర్శించుకొని అనంతరం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం చెరుకున్న రాష్టప్రతి దంపతులు, ఆలయ అర్చకులు పూర్ణ కుంకమ స్వాగతం పలికారు. అనంతరం భారత రాష్ట్రపతి దంపతులు మరియు తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గౌ : శ్రీ ఇ ఎస్ యల్.నరసింహన్ దంపతులు శ్రీ కపిల్లీశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ కపిలేశ్వరస్వామి దర్శనానంతరం రాష్ట్రపతి దంపతులు నవగ్రహ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్టప్రతి దంపతులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అంద‌జేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్తా, మదనపల్లి సబ్ కలెక్టర్ శ్రీమతి కీర్తి, అర్బన్ ఎస్పి శ్రీ అన్బురాజన్, టిటిడి అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, విఎస్వో శ్రీ అశోక్ కుమార్ గౌడ్, డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్,డ్వామా పి డి, నాగరాజు,మెప్మా పి డి.జ్యోతి, సెట్విన్ సి ఇ ఓ,లక్ష్మి, తదితరులు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!