ఈనెల 16 నుండి గురుపౌర్ణమి ఉత్సవాలు అమర్నాథ్ రెడ్డి..

VARTHA VIHARI NEWS : ఈనెల 16వ తేదీ మంగళవారం నుండి గురుపౌర్ణమి ఉత్సవాలు జరుగుతాయని నెల్లూరు గాంధీనగర్ శ్రీ షిరిడి సాయి బాబా మందిరం చైర్మన్ మన్యం అమర్నాథ్ రెడ్డి తెలిపారు. శనివారం మందిర ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 16 వ తారీకు నుంచి 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని అలాగే 16 వ తారీకు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు బాబా వారికి శ్రీ మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, సామూహిక స్తోత్ర సహస్రనామ పూజలు జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం మందిర ప్రాంగణంలో సామూహిక లలితా సహస్రనామాలు, హనుమాన్ చాలీసా తదితర కార్యక్రమాలు జరుగుతాయని అమర్నాథ్ రెడ్డి తెలిపారు. 23వ తేదీ సాయంత్రం బాబా వారికి పుష్పయాగం ఉంటుందని, అలాగే 24వ తారీకు సాయంత్రం మేళతాళాలతో బాబా వారి నగరోత్సవం జరుగుతుందని తెలిపారు,. ముఖ్యంగా 25వ తేదీ మధ్యాహ్నం బాబా వారికి ఎంతో ఇష్టమైన అన్నదాన కార్యక్రమం జరుగుతుందని పై అన్నదాన కార్యక్రమానికి నగరంలోని ప్రజలందరూ విచ్చేసి బాబా ప్రసాదం స్వీకరించమని అమర్నాథ్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో మందిరం కార్యవర్గ సభ్యులు కొల్లు శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!