బడ్జెట్లో నిరుద్యోగ భృతికి, పేదల కడుపు నింపే అన్న కాంటీన్లకు ఎసరు-బడ్జెట్ కెటయింపులలో యువతకు తీరని అన్యాయం

VARTHA VIHARI NEWS : నిన్న అసంబ్లీ లో వైస్సార్సీపీ ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నీరుద్యోగభృతి కి ఎసరు పెట్టారని,పేదల కడుపునింపే అన్న క్యాంటీన్లను మూసి వేసారని,నిన్నటి ఎన్నికలలో వైస్సార్సీపీ కి అండదండలు అందించిన యువతకు బడ్జెట్ లో తీరని అన్యాయం చేసారని ఈరోజు కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రములోని యువత శ్రీ వై యెస్ జగన్మోహన్ రెడ్డి గారి పై ఎన్నో ఆశలు పెట్టుకొని మొన్నటి ఎన్నికలలో ఆయనను గెలిపించారని,ఆయన మాత్రం ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లోనే యువతకు తీరని అన్యాయం చేసారని, గత ప్రభుత్వం లో నిరుద్యోగ యువతకు ప్రతి నెల 2వెల రూపాయలు చొప్పున ఇస్తున్న నిరుద్యోగభృతిని తీసియేయడము తో పాటు,యువజన క్రీడల శాఖకు బడ్జెట్ కేటాయింపుల్లో 71 శాతం నిధులు తగ్గించి భారీ కోత విధించారని,యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఐ టి శాఖకు బడ్జెట్లో 54.59 శాతం నిధులు తగ్గించారని,అదేవిధంగా పేద ప్రజల కడుపు నింపేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లను మూసివేసారని, కుటుంబ సభ్యులు చనిపోయిన తరువాత ఆ కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం చంద్రన్న బీమా ప్రవేశపెట్టినదని,ఈ పథకంలో సహజ మరణం చెందిన వారికి రెండు లక్షలు పరిహారం ఇస్తుండగా దానిని లక్ష రూపాయలు కు తగ్గించారని,అదేవిధంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న 11శాఖలకు గతంలో కంటే నిధులు తగ్గించారని, నీటిపారుదల శాఖ కు 22.61శాతం,పట్టణాభివృద్ధి శాఖ కు 14.90 శాతం,మైనార్టీల సంక్షేమ కు 13.56 శాతం,సాంఘిక సంక్షేమ శాఖ కు 7.63 శాతం,మహిళా సంక్షేమం కు 10.59 శాతం నిధులు తగ్గించారని రాజధాని నిర్మాణం కోసం కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించారని, నిన్న శాసనసభ లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందే సభలో ముఖ్యమంత్రి గారు రైతులకు జీరో శాతం వడ్డీలకు సంవత్సరానికి 3 వేల కోట్లు అవసరం అని చెప్పి బడ్జెట్లో 100 కోట్లు మాత్రమే కేటాయించారని,ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామని, దానిలో 10 మంది ఉద్యోగుల ను నియమిస్తామని చెప్పారని అలెక్క ప్రకారం రాష్ట్రంలో 18 వేల సచివాలయాలు ఏర్పాటు కానున్నాయని,వీటిలో లక్షా ఎనబై వేల మంది ఉద్యోగులు నియమించాలని వీరికి కనీస జీతం 18 వేలు ఇచ్చినా సంవత్సరానికి కేవలం జీతాలకే 3880 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో కేవలం 700 కోట్లు మాత్రమే కేటాయించినారని, ఆరోగ్యశ్రీ క్రింద 1000 రూపాయలు పై బడిన వైద్య ఖర్సులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారని దీనికి బడ్జెట్లో కేవలం 1760 కోట్లు మాత్రమే కేటాయించరని, ప్రభుత్వం చెప్పే మాటలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపు కు సంభందం లేదని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!