లోకేష్‌ను విమర్శించే హక్కు అన్నం సతీష్‌కు లేదు – బచ్చుల అర్జునుడు

VARTHA VIHARI NEWS : తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి ఇప్పటికే అన్నం.. ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ జాతీయ నేతలు నడ్డా, అమిత్‌షాలను సతీష్ కలవనున్నారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో నేడే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. అన్నం రాజీనామా చేసిన తర్వాత మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై విమర్శలు గుప్పించారు.

అయితే అన్నం వ్యాఖ్యలను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా.. టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. స్వార్థం కోసం పార్టీ మారిన అన్నం సతీష్‌కు.. లోకేష్‌ను విమర్శించే హక్కు లేదన్నారు. గతంలో లోకేష్ చొరవతోనే సతీష్‌కి ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని.. చేతలు లేవని బచ్చుల అర్జునుడు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!