చెట్టుని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు

VARTHA VIHARI NEWS : ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొనడంతో 30 మందికి గాయాలైన ఘటన చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడు వద్ద జరిగింది. కనిగిరి నుంచి ఒంగోలుకు వస్తున్న బస్సు ఎర్రగుడిపాడు వద్దకు చేరుకోగానే డ్రైవర్‌కు ఒక్కసారిగా బీపీ డౌన్ అయింది. దీంతో బస్సును అదుపు చేయలేక వెళ్లి చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలు కాగా.. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
గత ఆరు నెలలుగా డ్రైవర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆరునెలలుగా డ్రైవర్ గ్యారేజీలోనే విధుల నిర్వహిస్తున్నట్టు సమాచారం. హెల్త్ కండిషన్ సరిగా లేకపోయినా అధికారులు డ్యూటీ వేసినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!