పేలిన నాటు బాంబు.. యువకుడికి గాయాలు

VARTHA VIHARI NEWS : కడప జిల్లాలో నాటు బాంబు పేలడంతో ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. మైలవరం మండలం రామచంద్రాయపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. గురువారం సమీప పొలంలోని బావి వద్ద శేఖర్ అనే యువకుడు మట్టి పని చేస్తుండగా ఒక బక్కెట్ కనిపించింది. దానిని పట్టుకొని చూసే లోపు పెద్ద శబ్దంతో నాటు బాంబు పేలింది. దీంతో శేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని హుటాహుటిన జమ్మలమడుగు ఆస్పత్రి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!