ఎల్లసిరికి అరుదైన “రాజన్న కుటుంబ కానుక”….

VARTHA VIHARI NEWS : డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి గారి 70వ జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన వై సి పి రాష్ట్ర నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారికి అరుదైన అపూర్వ కానుకను పంపించి గౌరవించారు. రాజశేఖరరెడ్డి గారి అభిమానిగా ఉండి ఆయన మరణానంతరం నాటి అధికార కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు వై ఎస్ జగన్మోహనరెడ్డి గారి వెంట అండగా నిలిచారు. అటువంటి నాయకులను వై ఎస్ ఆర్ కుటుంభం ఎప్పటికీ మరచిపోదని రుజువు చేస్తూ రాజశేఖరరెడ్డి గారి బట్టలు, స్వీట్లు ఫోటోలు పంపించారు విజయమ్మ గారు. ఆ కానుకను అందుకున్న ఎల్లసిరి గోపాలరెడ్డి గారు రాజశేఖరరెడ్డి గారితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురై చెమ్మగిల్లిన కళ్ళతో ఆయన కుటుంభం తనపట్ల చూపిన అభిమానాన్ని సంతోషాన్ని అందరితో పంచుకుంటున్నారు. ఇదే కదా వై ఎస్ ఆర్ కుటుంభం గొప్పదనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!