శ్రీవారి సేవకై వచ్చిన సుమన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన టీటీడీ చైర్మెన్….

VARTHA VIHARI NEWS : సుమన్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని టీటీడీ చైర్మెన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు హామీ ఇచ్చారు.సుమన్ కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు.టీటీడీ నిభందనలు మేరకు సహాయం అందిస్తామన్నారు.టీటీడీ, స్విమ్స్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు .సుమన్ పార్థీవదేహాన్ని తెలంగాణలోని స్వగ్రామానికి తరలించేందుకు టీటీడీ తరుపున ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులకు సూచించారు.సుమన్ కుటుంబాన్ని ఆదుకునే విషయమై తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ టీటీడీ చైర్మెన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి గారితో ఫోన్లో సంప్రదించారు. సుమన్ మృతదేహానికి సంబంధించి స్విమ్స్ ఆసుపత్రిలో జరగాల్సిన ప్రక్రియను త్వరగా జరిపించాలని, టీటీడీ తరుపున బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!