గవర్నర్‌తో జగన్ భేటీ… పలు అంశాలపై చర్చ

VARTHA VIHARI NEWS : తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. పలు అంశాలపై సుమారు గంటసేపు ఇరువురు మంతనాలు జరిపారు. ఈనెల 11 నుంచి ప్రారంభంకానున్న బడ్జెట్‌ సమావేశాలపై చర్చించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై సమాలోచనలు చేశారు. అలాగే బడ్జెట్‌ కూర్పు, కేటాయింపులు, కేంద్ర నిధులపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగడంపై గవర్నర్‌తో జగన్‌ ప్రస్తావించారు. కేంద్రం నుంచి అదనపు నిధులు రాబట్టే అంశంపై చర్చించారు. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంపై కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!