జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం….

VARTHA VIHARI NEWS : జాతీయ విద్యా దినోత్సవం మరియు ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో  ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎబివిపి గూడూరు శాఖ ఆధ్వర్యంలో  స్థానిక బాలాజీ జూనియర్ కళాశాలలో ఎల్ వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ మరియు స్వర్ణభారతి ట్రస్ట్ సహకారంతో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించామని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పునర్నిర్మాణం కోసం ఏబీవీపీ విద్యార్థి సంఘం పనిచేస్తుందని  విద్యార్థి సమస్యల కోసం దేశం, కోసం పని చేస్తున్న ప్రపంచంలోని ఏకైక అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని ఆయన తెలియజేశారు ఏబీవీపీ మీ విద్యార్థి సంఘం ఆవిర్భావం జరిగి 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కోటా సునీల్ గారు మాట్లాడుతూ ఏబీవీపీ విద్యార్థి సమస్యలే కాకుండా జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన తెలిపారు. భారతదేశాన్ని విశ్వ గురువుగా చూడాలనే ఆశయంతో పని చేస్తున్న విద్యార్థి సంఘం ఏబీవీపీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సభ్యులు , స్వర్ణ భారతి ట్రస్ట్ సభ్యులు మరియు ఏబీవీపీ నగర అధ్యక్షులు దొరబాబు,శశి ,సురేంద్ర ,రాజ్ కుమార్, కాశీ రామ్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!