ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం….

VARTHA VIHARI NEWS: జాతీయ విద్యార్ధి దినోత్సవం సందర్భంగా గూడూరులోని ఏబీవీపీ అసోసియేషన్  ఆధ్వర్యంలో జులై 9 వ తేదీన ఉదయం 10 గంటలనుండి ఐ క్యాంప్ ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మరియు స్వర్ణ భారతి ట్రస్ట్ వారి సహకారంతో నిర్వహిస్తున్నామని స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మనోజ్ కుమార్ తెలిపారు.జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా శ్రీ బాలాజీ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గూడూరు ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు.ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!