మై ఫ్రెండ్స్ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో నాన్ బయోడిగ్రేడబుల్ పదార్ధాల సేకరణ….

VARTHA VIHARI NEWS : మై ఫ్రెండ్స్ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో నెహ్రు యువకేంద్రం ఆదేశానుసారం 50Hrs of SWATCHATHA ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా    కొత్తపాలెం బీచ్ లోని నాన్ బయోడిగ్రేడబుల్ పదార్ధాలను సేకరించి శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మై ఫ్రెండ్స్ అస్సోసియేషన్ అధ్యక్షుడు రాహుల్ మాట్లాడుతూ…. 20 మంది సభ్యులతో కలిసి బీచ్ శుభ్రం చేయడం జరిగిందన్నారు. సేకరించిన పదార్దాలలో 70% ప్లాస్టిక్ మరియు 30% గాజు బాటిళ్లు ఉన్నాయన్నారు.ఇవి రెండు పదార్దాలు సముద్రంలోని జీవులను హాని కలిగించేవాని, మనం బీచ్ కి వెళ్లి వచ్చేటప్పుడు వ్యర్ధ పదార్దాలు తమ వెంట తీసుకొని వెళ్లి డంపింగ్ యార్డ్ లో వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాహుల్, సభ్యులు మొహమ్మద్ అలీ, సాయి, కలీమ్, హరి, పవన్, గిరి, దావూద్, సాయి తేజ, రవి వర్మ, జవాద్, సాధిక్, శ్రీ, షన్ను, అరవింద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *