కన్నా లక్ష్మీనారాయణతో సుజనాచౌదరి భేటీ…..

VARTHA VIHARI NEWS:ఏపీలో బీజేపీని బలోపేతం చేయడానికి ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో ఎంపీ సుజనాచౌదరి భేటీ అయ్యారు. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన తర్వాత మొదటిసారిగా పార్లమెంట్‌లోని బీజేపీ కార్యాలయానికి సుజనాచౌదరి వచ్చారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై కన్నాతో సుజనాచౌదరి చర్చించినట్లు సమాచారం.

ఇటీవల టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా, సీఎం రమేష్‌, గరికపాటి, టీజీ వెంకటేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నలుగురు సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ అందజేశారు. అనంతరం బీజేపీ వర్కంగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఈ నలుగురు ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నలుగురు ఎంపీలను బీజేపీ అగ్రనేత నడ్డా సాదరంగా ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!