ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్…..

VARTHA VIHARI NEWS:అంతర్జాతీయ ఒలింపిక్ డే రన్ ను ఈ రోజు ఉదయం స్థానిక సర్వోదయ కాలేజీ నందు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష్యుడు ముక్కాల ద్వారాకనాథ్ ప్రారంభించారు. వందలాది మంది క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడా సంఘ నాయకులు ఉత్సాహంగా ఈ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ ర్యాలీ మద్రాసు బస్టాండు, వి.ఆర్.సి సెంటర్, గాంధీబొమ్మ మీదుగా వి.ఆర్ హైస్కూలు మైదానానికి చేరుకుంది. సందర్భంగా ముక్కాల ద్వారాకనాథ్ మాట్లాడుతూ క్రీడలే అందరిని ఒక చోట చేరుస్తాయని, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా ఒక మంచి సహృదయ వాతావరణం ఒక్క క్రీడల వల్లే సాధ్యం అన్నారు. స్వతహాగా క్రీడాకారుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు క్రీడల అభివృద్ధికి ఒక చక్కటి ప్రణాళికలను ఏర్పరచుకొని రాష్ట్రంలో ఈ క్రీడల అభివృద్ధికి చేయూత నిస్తురాన్నారు. జిల్లా మంత్రులు పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి సహకారంతో మరియు జిల్లా MLA ల తో కలసి క్రీడలను జిల్లాలో అభివృద్ధి పరుస్తామన్నారు. క్రీడా సంఘాల మధ్య ఉన్న బేదాలను రూపుమాపి ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టుతామన్నారు. అందరి సమిష్టి కృషితోనే అది సాధ్యమన్నారు. తమ సంస్థ సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రతిభ కల్గిన క్రీడాకారులకు ప్రోత్సాహాలు ఉంటాయని ఇప్పటికే చాలామంది క్రీడాకారులు లబ్ది పొందారని ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి గా విచ్చేసిన సెట్నెల్ సి.ఈ.ఓ కనక దుర్గా భవాని మాట్లాడుతూ క్రీడలు సమైక్య భావానికి నిదర్శనమన్నారు. తమవంతు కృషిగా జిల్లాలో క్రీడల అభివృద్ధికి జిల్లా క్రీడాపాధికార సంస్థ ఎప్పుడు దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్న నెల్లూరు జిల్లా క్రీడాకారులను అతిధులు ఘనంగా సత్కరించారు. ర్యాలీ లో పాల్గొన్న క్రీడాకారులకు సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ క్రీడా దుస్తులను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమములో ఒలింపిక్ అసోసియేషన్ సి.ఈ. ఓ పసుపులేటి రామమూర్తి, ప్రధాన కార్యదర్శి అరిగెల విజయ కుమార్, సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి నిమ్మల వీర వెంకటేశ్వర్లు, పి.ఈ. టి అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణా రెడ్డి, డి.యెస్.ఏ చీఫ్ కోచ్ పాండు రంగా రావు, సర్వోదయ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సి.వి.సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు, వెటరన్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!