“నెక్స్ట్ వెంకటగిరి” కి… నేడే శ్రీకారం !!!

VARTHA VIHARI NEWS:వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తొలిసారిగా వెంకటగిరిలో నేడు అధికార కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా నేడు మొదటగా… శిథిలావస్థలో ఉన్న గోషా హాస్పిటల్ పునరుద్ధరణ కోసం, వైద్య అధికారులతో కలిసి హాస్పిటల్ ను సందర్శించనున్నారు.ఆ తరువాత వెంకటగిరి మునిసిపల్ కార్యాలయంలో… మధ్యాహ్నం 12 గంటలకు సాధారణ మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు… మునిసిపల్ కార్యాలయంలోనే వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల్లో నెలకొన్న త్రాగునీటి ఎద్దడిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!