తెప్పపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం…..

VARTHA VIHARI NEWS : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో రెండో రోజైన శుక్ర‌వారం శ్రీసుందరరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.00 నుండి 4.00 గంటల వరకు శ్రీ సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో స్వామివారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీసుందరరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుప‌తి

డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం,డిఈ శ్రీ చంద్రశేఖర్, డీప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్వశ్రీ రమాదేవి , సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణ‌, ఈశ్వరయ్య ,ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *