చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్‌…..

VARTHA VIHARI NEWS:మాజీ సీఎం చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ నిధులు వినియోగించారని బోరుగడ్డ అనిల్‌ అనే వ్యక్తి పిటిషన్‌ వేశారు. పుసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాల పేరుతో ఓటర్లను ప్రభావితం చేశారన్న పిటిషనర్‌ పేర్కొన్నారు. చంద్రబాబు సొంత ఖర్చుల కింద నిధులను వసూలు చేయాలని కోరారు. అనిల్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటీషన్‌పై ఈనెల 18న విచారణ జరుగనుంది.

మరోవైపు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేపట్టిన ‘ధర్మపోరాట దీక్ష’ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో రాజకీయలబ్ధి కోసం ధర్మపోరాటదీక్ష పేరుతో సభ నిర్వహించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంటూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వి.సూర్యనారాయణరాజు పిల్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా విచారణకు హాజరైన అడ్వకేట్‌ జనరల్‌ సుబ్రమణ్యం శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని, 2వారాల గడువు కావాలన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!