‘ఈ నెల 17న జగన్, కేసీఆర్, గవర్నర్ వస్తున్నారు’

VARTHA VIHARI NEWS:నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఈ నెల 15, 16, 17న సన్యాసికారి దీక్ష ఏర్పాటు చేస్తున్నట్లు జగద్గురు శంకరాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. ఈ ఉత్తరాధికార బాధ్యతలను కిరణ్ కుమార్‌కు అప్పచెప్పామన్నారు. శుక్రవారం నాడు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అమ్మవారిని స్వరూపానందేంద్ర దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభంతో ఆలయ ఈఓ కొటేశ్వరమ్మ స్వాగతం పలికారు. స్వరూపానందేంద్ర అమ్మవారి దర్శనాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు విష్ణు, జోగి రమేష్, దేవాదాయ శాక కమిషనర్ పద్మ.. దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా.. అమ్మవారి దర్శనాంతరం ప్రసాదాలను స్వామివారికి అందజేశారు.

  ఈ నెల 17న…

ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన స్వరూపానందేంద్ర.. దేవాలయ భూములు, వ్యవస్ధలు, టీటీడీలో అగడాలపై పోరాటం చేసిన ఏకైక పీఠం విశాఖపీఠం మాత్రమేనన్నారు. లోక కల్యాణార్ధం సన్యాసికారి కార్యక్రమం చేస్తున్నామని.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు పడాలని సన్యాసిదీక్ష చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్… తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరువుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!